TPT: శ్రీకాళహస్తీశ్వర దేవస్థానానికి సినీ నటుడు సుమన్ ఆదివారం వచ్చారు. ఈ సందర్భంగా స్వామి, అమ్మవార్ల అభిషేక సేవలో పాల్గొన్నారు. అభిమానులు ఆయనకు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు కల్పించారు. అనంతరం మృత్యుంజయ స్వామి సన్నిధి వద్ద వేద పండితుల ఆశీర్వచనంతో తీర్థప్రసాదాలను అందజేశారు. శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని సుమన్ అన్నారు.