NLR: దుత్తలూరు తహశీల్దార్ కార్యాలయ సమీపంలో ఆదివారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ఉదయగిరి నుంచి దుత్తలూరు వైపు వస్తున్న ఆటో అదుపు తప్పి బోల్తా కొట్టింది. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఉదయగిరి ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.