AP: కడప జిల్లా ప్రొద్దుటూరులో దారుణం చోటుచేసుకుంది. తల్లి లక్ష్మీదేవితో కుమారుడు యశ్వంత్ రెడ్డి గొడవపడ్డాడు. ఈ క్రమంలో తీవ్ర ఆగ్రహానికి గురై కత్తితో ఆమె గొంతు కోశాడు. రక్తపు మడుగులో ఉన్న తల్లిని ఈడ్చుకుంటూ వెళ్లి ఇంటి బయటపడేశాడు. తల్లి హత్య సమయంలో తండ్రిని యశ్వంత్ గదిలో బంధించాడు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. యశ్వంత్ మానసిక స్థితి సరిగా లేదని చెబుతున్నారు.