JN: రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నిక కాబోతున్న వేం నరేందర్ రెడ్డిని జనగామ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు నాగపురి కిరణ్ కుమార్ శుక్రవారం హైదరాబాద్లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారికి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జనగామలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై వారితో కాసేపు చర్చించారు. ఎన్నికకు సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు.