WGL: నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మాతృమూర్తి దొంతి కాంతమ్మ శనివారం అనారోగ్యంతో మరణించారు. హనుమకొండలోని ఆయన స్వగృహంలో భౌతికకాయాన్ని అభిమానుల సందర్శనార్థం ఉంచారు. ఈ విషయం తెలుసుకున్న మంత్రి సీతక్క ఎమ్మెల్యే మాధవరెడ్డి ఇంటికి చేరుకొని కాంతమ్మ భౌతికాయానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం ఆమె ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డికి మాతృ వియోగం బాధాకరమన్నారు.