NDL: టీడీపీ నాయకులకు సహకారం అందిస్తూ వారికి వత్తాసు పలుకుతున్న అధికారులను విడిచిపెట్టే ప్రసక్తే లేదని మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి అన్నారు. శనివారం సంజామల మండలం గిద్దలూరులో వైసీపీ కార్యకర్తలతో సమావేశం ఆయన నిర్వహించారు. వైసీపీ శ్రేణులపై కూటమి నాయకులు చేసే అరాచకాలను డిజిటల్ క్యూ ఆర్ కోడ్ ద్వారా తెలియజేయాలని కార్యకర్తలకు సూచించారు.