»100 Feet Statue Of Krishna In Heritage City New Brundavan Soon
Heritage City : హెరిటేజ్ సిటీలో 100 అడుగుల కృష్ణుడి విగ్రహం..త్వరలో కొత్త బృందావనం
హెరిటేజ్ సిటీ(Heritage City)లో కృష్ణుడి ఆలయం భక్తులను కనువిందు చేయనుంది. 2034 నాటికి మూడు దశల్లో 750 ఎకరాల్లో హెరిటేజ్ సిటీని నిర్మించనున్నట్లు అధికారులు ప్రకటించారు.
ఢిల్లీలోని అక్షరధామ్ ఆలయం తరహాలో కొత్త బృందావనాన్ని(New Brundaavan) నిర్మించనున్నారు. యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై మధుర బృందావన్ సమీపంలో వారసత్వ నగరాన్ని నిర్మించనున్నారు. ఆ ఆలయ ప్రాంగణంలో 100 అడుగుల కృష్ణుడి విగ్రహాన్ని(Lord Krishna Temple) ఏర్పాటు చేసి నిత్య పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఢిల్లీలోని హైస్ట్రీట్ మార్కెట్, ఉదయపూర్‌లోని శిల్పా గ్రామాల మాదిరిగానే కొత్త బృందావనంలో కూడా సుందర నగరాలను నిర్మించనున్నారు.
హెరిటేజ్ సిటీ(Heritage City)లో కృష్ణుడి ఆలయం భక్తులను కనువిందు చేయనుంది. 2034 నాటికి మూడు దశల్లో 750 ఎకరాల్లో హెరిటేజ్ సిటీని నిర్మించనున్నట్లు అధికారులు ప్రకటించారు. కృష్ణ దేవాలయం(Krishna Temple), 100 అడుగుల ఎత్తైన కన్నయ్య విగ్రహాన్ని హెరిటేజ్ సిటీలో నిర్మించి పర్యాటక ప్రాంతం(Tourist Area)గా తీర్చిదిద్దనున్నట్లు వెల్లడించారు.
ప్రతిష్టాత్మకంగా నిర్మించే ఈ హెరిటేజ్ సిటీ(Heritage City) ఆధ్యాత్మిక, సాంస్కృతిక సముదాయంగా మారుతుందని, ఈ సిటీలో శ్రీకృష్ణుని జీవితంలోని ముఖ్య ఘట్టాలను తెలిపేలా ప్రదర్శనలు ఉంటాయని అధికారులు తెలిపారు. సిటీలో హిందూ సాంస్కృతిక, సాంప్రదాయాలను తెలిపేలా కృష్ణుడి బోధనలు ఉంటాయని, ఎగ్జిబిషన్‌ను కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు. అంతేకాకుండా ఈ హెరిటేజ్ సిటీలో స్లైడ్, సౌండ్ షోలు ఉంటాయని, మ్యూజియం(Museun)లో ఆటోమేటెడ్ బోట్‌ను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
యమునా ఎక్స్‌ప్రెస్ వే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అథారిటీ సీఈఓ అరుణ్ వీర్ సింగ్(Arun veer Singh) హెరిటేజ్ సిటీ(Heritage City) నిర్మాణం గురించి పలు విషయాలను తెలిపారు. ఈ సిటీలో ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ మార్కెట్ తెరవనున్నామన్నారు. హిందువుల పండుగలు నిర్వహించేందుకు ప్రత్యేకంగా యాంఫి థియేటర్‌ను కూడా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. మూడు దశల్లో సిటీ నిర్మాణం జరుగుతుందన్నారు. 2024 నుంచి 2027 మధ్య మొదటి దశ పనులు ప్రారంభమవుతాయన్నారు.