ఈ ఏడాది మొదటి చంద్ర గ్రహణం(Chandra Grahan 2023) మే 5వ తేదీన కనపడనుంది. ఈ ఏడాది మొత్తం 4 గ్రహాలు ఏర్పడే అవకాశం ఉంది. ఇటవల ఓ సూర్యగ్రహణం అయిపోగా.. ఇప్పుడు మరో వారంలో తొలి చంద్ర గ్రహణం ఏర్పడనుంది. ఇది మే 5న రాత్రి 8:44 గంటలకు ప్రారంభమవుతుంది. మే 6, 2023 ఉదయం 1:00 గంటల వరకు ఉంటుంది. దీని మొత్తం వ్యవధి దాదాపు 4 గంటల 15 నిమిషాలు. ఈ గ్రహణాన్ని పెనుంబ్రల్ చంద్ర గ్రహణంగా ఖగోళ నిపుణులు పేర్కొంటున్నారు.
ఈ గ్రహణం భారత్(india)లో కనిపించదట. యూరప్, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, అంటార్కిటికా, మధ్య ఆసియా, పసిఫిక్ అట్లాంటిక్, హిందూ మహాసముద్రంలో కనిపించనున్నది. గ్రహణం దాని పూర్తి పరిమాణంలో మాత్రమే కనిపించడమే కాకుండా.. కాస్తంత అస్పష్టంగా కనపడుతుందని ఖగోళ నిపుణులు చెబుతున్నారు.
ఈ సంవత్సరం మొదటి చంద్రగ్రహణం(First lunar Eclipse) వైశాఖ మాసం పౌర్ణమి రోజున జరుగుతోంది. ఇది ఖగోళ సంఘటనగా పరిగణించబడుతుంది. చంద్రుడు మరియు సూర్యుని మధ్య భూమి వచ్చినప్పుడు, చంద్రగ్రహణం ఏర్పడుతుంది. చంద్ర గ్రహణానికి ముందు సూతకాల కాలం ప్రారంభమవుతుంది. భారత్ లో కనిపించదు కాబట్టి, ఎలాంటి సూతకం పాటించాల్సిన అవసరం లేదు.