కృష్ణా: అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తమ ఎమ్మెల్యే కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను శనివారం పంపిణీ చేశారు. 23 మంది లబ్ధిదారులకు రూ. 21,90,737 సహాయం చెక్కులు అందచేశారు. తమ ప్రభుత్వంలో ఇప్పటికి 627 మంది పేదలకు 4,89,34,363లు ఆర్థిక సహాయాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా సహాయం అందించినట్లు వివరించారు.