గాజాలో శాంతి ప్రయత్నాలపై భారత ప్రధాని మోదీ స్పందించారు. శాంతి కోసం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలను ఆయన స్వాగతించారు. ఇజ్రాయెల్ బందీల విడుదలకు హమాస్ అంగీకారం తెలపడం శాంతిస్థాపనకు ఓ కీలక ముందడుగు అని మోదీ అన్నారు. మధ్యప్రాచ్యంలో శాశ్వత శాంతిని పునరుద్ధరించేందుకు చేపట్టే అన్ని ప్రయత్నాలకు భారత్ ఎల్లప్పుడూ మద్దతుగా ఉంటుందని హామీ ఇచ్చారు.