ELR: ఏలూరు నగరంలోని స్థానిక కోటదిబ్బ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శనివారం జరగనున్న ఆటో డ్రైవర్లకు వాహన మిత్ర కార్యక్రమానికి సంబంధించి సభ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శుక్రవారం రాత్రి ఏర్పాట్లను ఎమ్మెల్యే బడేటి చంటి, కూటమి నాయకులు, పోలీసులు పరిశీలించారు. అనంతరం సభకు వచ్చే ప్రతి ఒక్కరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాటు చేయాలని సూచించారు.