GNTR: ఎస్పీ వకుల్ జిందాల్ నల్లపాడు పోలీస్ స్టేషన్లో నిన్న ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఆయన స్టేషన్ రికార్డులు, పరిసరాల పరిశుభ్రత, సీసీ కెమెరాల పనితీరును పరిశీలించారు. ముఖ్యంగా పెండింగ్ కేసుల పరిష్కారంపై దృష్టి సారించాలని సిబ్బందికి సూచించారు. పోలీస్ సిబ్బంది ప్రజలతో మరింత పారదర్శకంగా, క్రమశిక్షణతో వ్యవహరించాలని, ఫిర్యాదులను సమయానికి పరిష్కరించాలని పేర్కొన్నారు.