ATP: అనంతపురం, ధర్మవరం మీదుగా వెళ్లే యశ్వంతపూర్- కాచిగూడ (20703/04) వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలు సర్వీసు రోజులను మార్పు చేసినట్లు రైల్వే అధికారులు శుక్రవారం తెలిపారు. ఈ రైలు ప్రస్తుతం శుక్రవారాలు మినహా మిగతా అన్ని రోజుల్లో నడుస్తోంది. డిసెంబరు 4 నుంచి వారంలో బుధవారం మినహా ఇతర రోజుల్లో ప్రయాణించేలా. సర్వీసును మార్పు చేసినట్లు అధికారులు తెలిపారు.