సీనియర్ హీరో వెంకటేష్ చేసిన పనికి.. మెగాస్టార్ చిరంజీవి(Megastar chiranjeevi) సైతం వెనకడుగు వేసినట్టే కనిపిస్తోంది. ఇప్పటి వరకు వెంకటేష్‌ను ఫ్యామిలీ హీరోగానే చూశాం. కానీ ఓటిటి కోసం చేసిన రానా నాయుడు వెబ్ సిరీస్ మాత్రం.. వెంకీ ఇమేజ్ మొత్తాన్ని డ్యామేజ్ చేసేసింది. అసలు ఓటిటి కంటెంట్ అంటేనే.. సెన్సార్ కట్స్ లేకుండా ఉంటుంది. వల్గారిటీ లేకుండా ఓటిటిలో వచ్చే వెబ్ సిరీస్‌లను వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు. ఈ జాబితాలోనే రానా నాయుడు(Rana Naidu) కూడా చేరిపోయింది. అందుకే మెగాస్టార్ బ్యాక్ స్టెప్ వేశాడనే న్యూస్ వైరల్‌గా మారింది.
కొడుకు రానాతో కలిసి వెంకటేష్ చేసిన రానా నాయుడు(Rana Naidu) వెబ్ సిరీస్.. బ్లూ ఫిల్మ్‌కు తక్కువ కాదనే రివ్యూలు వచ్చాయి. అసలు వెంకీ ఈ ప్రాజెక్ట్ ఎందుకు ఓకే చేశాడనేది.. ఎవరికీ అర్థం కాని విషయమే. అయితే ఒక్కసారి ఏదైనా ఓటిటి సంస్థకు అగ్రిమెంట్ చేస్తే.. ఎలాంటి కంటెంట్ అయినా చేయాల్సిందే. అందుకే వెంకీ ఇలా చేశాడనే టాక్ ఉంది. కారణాలు ఏమైనా రానా నాయుడు మాత్రం వెంకీకి గట్టి దెబ్బే వేసింది.
అందుకే ఇప్పుడు వెబ్ సిరీస్‌లు అంటేనే.. మన హీరోలు భయపడిపోతున్నారు. ఇప్పుడు మెగాస్టార్(Megastar chiranjeevi) కూడా ఓ భారీ ఓటిటి ఆఫర్‌ను రిజెక్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. గతంలో పలు సందర్భాల్లో.. మంచి కంటెంట్ దొరికితే వెబ్ సిరీస్ చేసేందుకు రెడీ అని చెప్పారు చిరంజీవి.
ఇప్పుడు మాత్రం ఓ బడా సంస్థ.. చిరుతో వెబ్ సిరీస్ కోసం అప్రోచ్ అవగా నో(no) చెప్పేశారట. దానికి కారణం వెంకీ చేసిన ‘రానా నాయుడు’ సిరీసేనని అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. కానీ కొందరు మాత్రం వెబ్ సిరీస్‌లపై వైపే చూస్తున్నారు. ముఖ్యంగా సమంత లాంటి స్టార్ హీరోయిన్లు బోల్డ్‌గా సిరీస్‌లు చేసేందుకు సై అంటున్నారు. ఏదేమైనా చిరు మాత్రం.. వెంకీ వల్లే ఓటిటికి నో చెప్పాడనే చెప్పొచ్చు.