E.G: దీపావళి పండుగను పురస్కరించుకుని గోపాలపురంలోని బాణాసంచా తయారీదారులు, షాపుల యజమానులకు ఎస్సై మనోహర్ గురువారం కీలక సూచనలు చేశారు. తయారీదారులు, విక్రయదారులు తప్పనిసరిగా అనుమతులు పొందాలని సూచించారు. లైసెన్స్ లేకుండా బాణాసంచాను ఇళ్లల్లో, షాపులలో, గోడౌన్లలో నిల్వ చేసినా, అనాధికార విక్రయాలు జరిపినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.