VKB: ధరూర్ మండలంలోని నగరం – మోమిన్కుర్దు గ్రామాల మధ్య రోడ్డు పూర్తి అధ్వానంగా తయారైంది.పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి, నీరు నిలిచి ప్రమాదాలకు దారితీస్తున్నాయి. రాత్రి సమయాల్లో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా R&B అధికారులు స్పందించి తక్షణమే గుంతలను పూడ్చాలని కోరుతున్నారు.