MLG: మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర రెడ్డి మరణం పట్ల మంత్రి దనసరి అనసూయ సీతక్క తీవ్ర విచారం వ్యక్తం చేశారు. రాంరెడ్డి కుటుంబ సభ్యులకు ఆమె ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. రాజకీయ రంగంలో దామోదర రెడ్డి సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి అభివృద్ధికి ఆయన చేసిన సేవలు మరువలేనివన్నారు.