HYD: ఇవాళ గాంధీ జయంతి సందర్భంగా లంగర్ హౌస్ లోనీ బాపూఘాట్ వద్ద గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు సందర్శించనున్నారు. బాపూఘాట్ వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి గాంధీకి నివాళులర్పించనున్నారు. అనంతరం బాపూ ధ్యాన మందిరానికి నడిచి వెళ్లి అక్కడ సర్వమత ప్రార్థనల్లో పాల్గొంటారు. ఈ సందర్భంగా బాపూ సమాధి, ధ్యాన మందిరాలను పూలతో అందంగా ముస్తాబు చేశారు.