MHBD: దక్షిణ మధ్య రైల్వే(SCR) పరిధిలోని డోర్నకల్ జంక్షన్ వద్ద ప్రతిపాదించిన కీలకమైన రైల్ ఓవర్ రైల్(ROR) ప్రాజెక్టుకు రైల్వేశాఖ ఆమోదం తెలిపింది. దాదాపు 10.5 కి.మిల పొడవైన ఈ నిర్మాణం పూర్తయితే, కాజీపేట-విజయవాడ-భద్రాచలం రోడ్ మార్గంలో క్రాసింగ్ సమస్యలు తొలగిపోతాయి. దీనివల్ల రైళ్లు వేగంగా, ఆటంకాలు లేకుండా ప్రయాణించగలుగుతాయి.