ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడలో మావోయిస్టులు(Maoists) రెచ్చిపోయారు. మావోలు జవాన్ల(Soldiers)పై దాడి చేశారు. మందుపాతర పేల్చడంతో 11 మంది జవాన్లు మృతి చెందారు. డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ సిబ్బంది జవాన్ల వాహనాన్ని మావోయిస్టులు(Maoists) టార్గెట్ చేశారు. అర్ణపూర్ ప్రాంతంలో జవాన్ల వాహనాన్ని టార్గెట్ చేసుకుని మందుపాతర పేల్చడంతో 11 మంది మరణించారు(11 Died).
మందుపాతర దాడిలో మరికొందరు జవాన్లు(Soldiers) గాయాలపాలయ్యారు. ఛత్తీస్‌గఢ్‌లో ఇటీవలె జవాన్లు మావోయిస్టుల(Maoists)పై ఉక్కుపాదం మోపారు. ఈమధ్యనే డిఫెన్స్ హెలికాఫ్టర్లు, డ్రోన్లతో జవాన్లు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో కొందరు మావోయిస్టు కీలక నేతలు సైతం ఎన్కౌంటర్లో మృతిచెందారు. ఇందుకు ప్రతీకారంగానే జవాన్లపై మావోయిస్టులు(Maoists) ఈ దారుణానికి పాల్పడ్డారని అధికారులు తెలుపుతున్నారు. 11 మంది జవాన్లు(Soldiers) మృతి చెందడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.
ఛత్తీస్‌గఢ్ లో గత కొన్ని రోజులుగా జవాన్లు, మావోయిస్టులకు మధ్య దాడులు జరుగుతున్నాయి. మావోయిస్టుల అరాచకాలను అంతం చేసే క్రమంలో మావోల నాయకుడిని పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు. మావోల్లో పలు దళాల నాయకులను కట్టడి చేయడంలో పోలీసులు కూడా ప్రాణాలొదిలారు. ఈ క్రమంలో పోలీసులపై కక్ష పెంచుకున్న మావోలు ప్రతీకారం తీర్చుకోవడం కోసం వారం రోజుల నుంచి కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జవాన్ల వాహనంపై ప్లాన్ ప్రకారం మందుపాతర పేల్చారు. ఈ ఘటనలో 11 మంది జవాన్లు మృతి చెందారు. మరికొంత మంది పరిస్థితి విషమంగా ఉంది.