ఐపీఎల్ (IPL) 2023 సీజన్ రంజుమీదుంది. బెట్టింగులు (betting) కూడా జోరుగా సాగుతున్నాయి. ఆన్ లైన్, ఆఫ్ లైన్ విధానంలో కూడా బెట్టింగ్ పెద్ద ఎత్తున జరుగుతోంది. ఈ క్రమంలో ఓ యువకుడు ఈ బెట్టింగ్ జూదానికి అలవాటు పడి భారీగా నష్టపోయాడు. అంతేకాదు ఫ్రెండ్స్, బంధువుల దగ్గర అప్పులు తీసుకుని మరీ బెట్టింగులు పెట్టాడు. కానీ ఆ క్రమంలో ఎక్కువగా డబ్బులు నష్టపోవడంతో అప్పుల భారం భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఏపీ(ap)లోని అనకాపల్లి జిల్లా(anakapalli district) దిబ్బపాలెం గ్రామంలో చోటుచేసుకుంది.
ఇదే గ్రామానికి చెందిన పెంటకోట నర్సింగ రావు, జయ దంపతుల కొడుకు మధు కుమార్(20) ఓ ప్రైవేటు కాలేజీలో డిగ్రీ రెండో ఏడాది చదువుతున్నాడు. అయితే ప్రస్తుతం ఐపీఎల్ 2023(ipl 2023) సీజన్ జరుగుతున్న క్రమంలో బెట్టింగ్(betting) కోసం ఓ వ్యక్తి దగ్గర డబ్బులు రుణంగా తీసుకున్నాడు. ఆ క్రమంలో బెట్టింగులో పెట్టిన డబ్బు తిరిగి రాకపోవడంతో యువకుడు తీవ్ర ఒత్తిడికి లోనయ్యాడు.
ఆ క్రమంలో కుటుంబ సభ్యులకు చెప్పలేక..మనోవేదనకు గురై ఈ నెల 23న ఎలుకల మందు తాగి ఆత్మహత్య యత్నం చేసుకున్నాడు. తర్వాత గమనించిన కుటుంబ సభ్యులు అతన్ని ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు. కానీ మంగళవారం యువకుడు మరణించాడు. మరోవైపు మృతుని తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు(police) కేసు నమోదు చేసి దర్యార్తు చేస్తున్నారు.