ఆంధ్రప్రదేశ్ కర్ణాటక బోర్డర్లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. చిత్తూరు జిల్లా అరవపల్లి సమీపంలోని కత్తార్లపల్లి దగ్గర వేగంగా వెళుతున్న కారు ప్రమాదవశాత్తు చెట్టును ఢీ కొట్టింది. దీంతో ఘటనలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందగా, మరో వ్యక్తికి గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.
అయితే మృతులు పుంగనూరు కాలనీ వాసులుగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు.