మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లా(Chandrapur district)లో ప్రయాణిస్తున్న కారు ఆదివారం సాయంత్రం ప్రమాదవశాత్తు వెళ్లి ప్రైవేట్ బస్సు(accident)ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా, ఒక బాలిక తీవ్రంగా గాయపడింది. చంద్రపూర్ జిల్లా కేంద్రానికి సుమారు 115 కిలోమీటర్ల దూరంలో నాగ్భిడ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాన్పా గ్రామంలో సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. నలుగురు అక్కడికక్కడే మరణించగా.. ఇద్దరు ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందారు. మృతదేహాలను పోస్ట్మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. నాగ్పూర్ నుంచి నాగ్భిడ్కు కారులో ఆరుగురు వ్యక్తులు ప్రయాణిస్తుండగా వారి వాహనం ఎదురుగా వస్తున్న ప్యాసింజర్ బస్సును ఢీకొట్టింది. వేగంగా వచ్చి ఢీకొట్టడంతో కారులోని నలుగురు వ్యక్తులు స్పాట్ చనిపోయారు. మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నారని అధికారులు తెలిపారు.