SRCL: వేములవాడలో రాజరాజేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం ప్రారంభమైంది. ఆలయ స్థానాచార్యులు నమిలికొండ ఉమేష్ శర్మ నేతృత్వంలో అర్చకులు, వేదపండితులు ముందుగా శ్రీస్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం గావించి కళ్యాణ క్రతువును ప్రారంభించారు. ప్రధాన ఆలయం ఆవరణలో ధ్వజారోహణం గావించిన అనంతరం వధూవరుల ఎదుర్కోళ్ల కార్యక్రమం నిర్వహించనున్నారు.