తెలుగు ఇండస్ట్రీ బుల్లితెరపై మోస్ట్ వాంటెడ్ యాంకర్‌గా సుమ(Anchor suma)కు విపరీతమైన క్రేజ్ ఉంది. ఆమె మాటతీరు, పంచు డైలాగులు అందర్నీ ఇట్టే ఆకట్టుకుంటాయి. అందుకే యాంకర్ సుమ ఏ షో చేసినా ప్రేక్షకులు మిస్సవ్వకుండా చూస్తుంటారు. అలాంటి షోలలో సుమ అడ్డా(Suma Adda) కూడా ఒకటి. ప్రతి శనివారం ఈ షో బుల్లితెర ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతోంది.
ఈ వారం ఎపిసోడ్ లో రామబాణం మూవీ(Ramabanam Movie) టీమ్ సుమ అడ్డాలో సందడి చేసింది. రామబాణం హీరో గోపీచంద్(Gopichand), హీరోయిన్ డింపుల్ హయతీ, గెటప్ శ్రీను, డైరెక్టర్ శ్రీవాస్ వంటి వారు షోకు వచ్చి సందడి చేశారు. ఈ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్(Viral) అవుతోంది. ఆ ప్రోమోలో యాంకర్ సుమ(anchor Suma) గొంతును గోపీచంద్ పట్టుకోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
రామబాణం సినిమా(Ramabanam Movie)తో గోపీచంద్(Gopichand), శ్రీవాస్ కాంబో మళ్లీ రిలీజ్ అవుతోంది. ఇప్పటికే వీరి కాంబోలో వచ్చిన ‘లక్ష్యం’, ‘లౌక్యం’ సినిమా సూపర్ హిట్ అయ్యాయి. ఈ మూవీకి మిక్కీ జే మేయర్ మ్యూజిక్ అందిస్తున్నాడు. మే 5వ తేదిన ఈ మూవీ రిలీజ్ (Release) కానుంది. సుమ అడ్డా షో 29వ తేదిన ప్రసారం కాబోతోంది. ఈ షోకు సంబంధించిన ప్రోమో చివర్లో యాంకర్ సుమ(anchor Suma) గొంతును గోపీంచంద్ ఎందుకు పట్టుకున్నాడో తెలియాలంటే శనివారం వరకూ ఆగాల్సిందే.