Vinesh Phogat, seven wrestlers move SC seeking FIR against WFI chief
Vinesh Phogat:రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ (WFI) బ్రిజ్ భూషణ్ సింగ్‌పై (brij bhusab singh) రెజ్లర్లు ఆగ్రహాంతో ఉన్నారు. ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరుతున్నారు. ఢిల్లీ పోలీసులు (delhi police) పట్టించుకోకపోవడంతో.. సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కోర్టును ఆశ్రయించిన వారిలో విఘ్నేస్ ఫోగట్ (vignesh poghat) సహా మరో ఏడుగురు రెజ్లర్లు ఉన్నారు.
బ్రిజ్ భూషణ్ సింగ్ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని ఆరోపణలు వచ్చాయి. బ్రిజ్ భూషణ్ సింగ్, కోచ్‌లపై చర్యలు తీసుకోవాలని రెజ్లర్లు కోరుతున్నారు. వీరి డిమాండ్‌తో కేంద్ర ప్రభుత్వం ఐదుగురు సభ్యులతో కమిటీని ఈ జనవరిలో వేసిన సంగతి తెలిసిందే. ఆ కమిటీకి మెరీ కోమ్ (mary kom) నేతృత్వం వహిస్తున్నారు. కమిటీ డబ్ల్యుఎఫ్ఐ, బ్రిజ్ భూషణ్ సింగ్ రోజువారీ కార్యకలాపాలపై అధ్యయనం చేస్తోంది.
కమిటీ వేసి 3 నెలలు అవుతున్న ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని రెజ్లర్లు అంటున్నారు. నిన్న జంతర్ మంతర్ వద్ద విఘ్నేశ్ ఫొగట్, సాక్షి మాలిక్, బజ్రంగ్ పునియా ఆందోళనకు దిగారు. 7 నెలల క్రితమే ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశామని. .ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదని వారు అంటున్నారు. కమిటీ వేసి.. 3 నెలలు అవుతున్నా ఎలాంటి చర్యలు లేవని అన్నారు. ఈ క్రమంలో సోమవారం మెరీ కోమ్ నేతృత్వంలోని కమిటీని ఢిల్లీ పోలీసులు రిపోర్ట్ అడిగారు.
తమకు మద్దతు తెలుపాలని బజ్ రంగ్ అన్ని పార్టీలను కోరారు. బీజేపీ, కాంగ్రెస్, ఆప్, ఇతర పార్టీలు అండగా ఉండాలని కోరారు. జనవరిలో చేపట్టిన ఆందోళనకు సీపీఎం నేత బృందా కారత్ రాగా.. దీనిని రాజకీయం చేయొద్దని వారు అప్పుడు కోరారు. ఇప్పుడు మాత్రం రాజకీయ పార్టీలకు ఆహ్వానం పలుకుతున్నారు.