SRD: సిర్గాపూర్ మండలం కడపల్లో నీటి సమస్య నెలకొంది. దాంతో గ్రామస్తులు ఆదివారం ఆందోళనకు దిగారు. గ్రామంలో 3 నీటి పథకం బోర్లు ఉండగా దీంట్లో ఒక బోరు చెడిపోయింది. మిగతా బోర్ల స్టార్టర్లు, బోర్డు చెడిపోయి సక్రమంగా పనిచేయడం లేదన్నారు. మిషన్ భగీరథ నీటి సరఫరా నిత్యం రావడం లేదని, దీంతో సమస్య తీవ్రమైందన్నారు. బోర్లకు మరమ్మతు చేయిస్తానని సెక్రెటరీ అరుణ్ తెలిపారు.