GNTR: అమరావతిలో సాగుతున్న వివిధ నిర్మాణ పనులను ఏజీఐసీఎల్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనివాస్ గురువారం స్వయంగా పరిశీలించారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ టవర్లు, ఎన్జీవో క్వార్టర్లు, హైకోర్టు, గవర్నమెంట్ కాంప్లెక్స్ పనుల పురోగతిని ఆయన తనిఖీ చేశారు. అనంతరం ఇంజనీరింగ్ అధికారులు, కాంట్రాక్టర్లతో సమీక్ష నిర్వహించి, నిర్ణీత గడువులోగా పనులను వేగంగా పూర్తి చేయాలన్నారు.