మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఇండోర్ స్టేడియంను ఇవాళ కలెక్టర్ విజయేందిర బోయి సందర్శించారు. మల్టీ పర్పస్ ఇండోర్ స్టేడియం, వాలీ బాల్ అకాడమీ, స్విమ్మింగ్ పూల్‌ను పరిశీలించి స్టేడియంలో నిర్వహించే క్రీడాంశాలను తెలుసుకున్నారు. స్విమ్మింగ్ పూల్ చుట్టూ పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. అనంతరం క్రీడాకారుల భోజనం వసతి సౌకర్యాలు తెలుసుకున్నారు.