HYD: అంబర్పేట బతుకమ్మ కుంట పేరు మారుమోగుతుంది. ఈ చెరువు అసలు పేరు ఎర్రకుంట. ఆనాడు దీని మీద ఆధారపడి ఎందరో జీవనం సాగించారని స్థానికులు చెబుతున్నారు. మత్స్యకారుల చేపల వేట, రజకులు బట్టలు ఉతికింది ఇక్కడే. పిల్లలు ఈత కొట్టింది కూడా ఇదే చెరువులో అని పెద్ద మనుషులు గుర్తుచేస్తున్నారు. బతుకమ్మ కుంట చరిత్ర ఆలస్యంగా తెలిసిందని HYD యువత ఆశ్చర్యపోతోంది.