SDPT: వర్గల్ శ్రీ విద్యాధరి క్షేత్రంలో శరన్నవరాత్రి మహోత్సవాలలో నాలుగవ రోజు గురువారం అమ్మవారు కాత్యాయని అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. శరన్నవరాత్రి ఉత్సవాలకు మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు హాజరు కాగా ఆలయం మర్యాదలతో స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు నిర్వహించి, వేద ఆశీర్వచనం అందజేశారు.