ADB: పౌష్టికాహారంతోనే ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండవచ్చునని మండల వైద్యాధికారి డాక్టర్ నిఖిల్ రాజ్ అన్నారు. భీంపూర్ మండలంలోని పలు గ్రామాల్లో గురువారం వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గర్భిణి మహిళలు, బాలింతలు పలువురికి వైద్య పరీక్షలు నిర్వహించి మందులను అందజేశారు. రోజువారి ఆహారపదార్థాలలో నూనె, చక్కెర స్థాయిలను తగ్గించుకోవాలని సూచించారు.