ELR: జీలుగుమిల్లి మండలం వంకవారిగూడెం పంచాయతీలో నిర్మాణం కాబోతున్న నేవీ ఆయుధాల డిపోకు పోలవరం నియోజకవర్గ బీజేపీ గిరిజన మోర్చా మద్దతు పలికింది. డిపో ఏర్పాటుకి కృషి చేస్తున్న ఎంపీ పుట్ట మహేష్, ఎమ్మెల్యే చిర్రి బాలరాజుకు పాలాభిషేకం చేశారు. ఈ ప్రాజెక్ట్ రావడం వలన గిరిజన అభివృద్ధితో పాటు మెరుగైన వైద్య సేవలు విద్యా రంగం అభివృద్ధి చెందుతుందని అన్నారు.