SKLM: బూర్జ మండలం ఎంపీడీవో కార్యాలయంలో క్లాప్ మిత్రులకు ఆరోగ్య పరీక్షలు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఇవాళ ఎంపీడీవో తిరుపతిరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ మేరకు ఎంపీడీవో మాట్లాడుతూ.. పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచడంలో క్లాప్ మిత్రుల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు. గ్రామాలను పరిశుభ్రంగా ఉంచడం ద్వారా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతున్నారని కొనియాడారు.