ప్రకాశం: కలెక్టర్ రాజాబాబు గురువారం దివాకరపల్లిలో పర్యటించారు. ఈ మేరకు రిలయన్స్ కంపెనీ నిర్మిస్తున్న బయో కంప్రెస్డ్ గ్యాస్ ప్లాంట్ నిర్మాణ పనులను కలెక్టర్ పరిశీలించారు. ఇందులో భాగంగా రెవెన్యూ అధికారులను అడిగి ప్లాంట్ నిర్మాణ వివరాలను తెలుసుకున్నారు. అనంతరం రైతుల నుంచి సేకరించిన భూ వివరాలను కూడా అడిగి తెలుసుకున్నారు.