NLG: బ్రాహ్మణ వెల్లెంల బ్యాలెన్స్ రిజర్వాయర్ కుడి కాలువ నుంచి నీటిని విడుదల చేయడంతో నార్కట్పల్లి పెద్ద చెరువు పూర్తిగా నిండి పొంగి పొర్లుతోంది. ఎండిపోయిన చెరువుకు తిరిగి జలకళ రావడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాంతంలోని రైతులకు పంటల సాగుకు నీరు పుష్కలంగా అందుబాటులోకి రావడంతో వారిలో ఆనందం వ్యక్తమవుతోంది.