KNR: ఈనెల 26, 27న వీణవంక మండలం చల్లూర్ గ్రామంలో నెహ్రూ యువ కేంద్రం మై భారత్ ఆధ్వర్యంలో బ్లాక్ లెవల్ క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా యువజన అధికారి వెంకట్ రాంబాబు ప్రకటన ద్వారా తెలిపారు. వాలీబాల్, కబడ్డీ, రన్నింగ్, షటీల్, బ్యాడ్మింటన్, చెస్ తదితర పోటీలు ఉంటాయి. ఆసక్తి గల క్రీడాకారులు 9989139012, 9502365465 నంబర్లను సంప్రదించాలని సూచించారు.