JGL: చిత్తశుద్ధి అంకిత భావంతో పనిచేసిన వారికి తప్పనిసరిగా గుర్తింపు లభిస్తుందని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. ఈనెల 13వ తేదీ శనివారం నిర్వహించిన జాతీయ మెగా లోక్ అదాలత్లో జిల్లా పరిధిలో 3214 కేసుల పరిష్కారానికి కృషి చేసిన పోలీస్ అధికారులు, సిబ్బంది, బార్ అసోసియేషన్ సభ్యులను నిన్న బుధవారం జిల్లా జడ్జి రత్న పద్మావతి అభినందించారు.