ప్రకాశం: తాళ్లూరు మండలంలోని నాగంబొట్లపాలెం గ్రామంలో ‘స్వస్త్ నారి – సశక్తి పరివార్’ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. క్యాన్సర్ వ్యాధిపై మహిళలకు డాక్టర్ మౌనిక వివరించారు. ఇందులో భాగంగా 158 మంది గర్భిణి, బాలింతలకు పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.