TG: HYD కొండాపూర్లోని మ్యాడ్ క్లబ్ అండ్ కిచెన్లో కస్టమర్లు, బౌన్సర్ల మధ్య జరిగిన గొడవలో ముగ్గురు బౌన్సర్లకు తీవ్ర గాయాలయ్యాయి. బిల్లు చెల్లించాలని మేనేజర్ కస్టమర్లను అడగడంతో గొడవ మొదలైంది. ఆగ్రహానికి గురైన కస్టమర్లు బౌన్సర్లపై దాడి చేశారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బౌన్సర్లు ప్రస్తుతం కొండాపూర్ ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.