TG: రాష్ట్రంలో భానుడు భగభగమంటున్నాడు. పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. ఇవాళ ములుగు జిల్లా మంగపేటలో అత్యధికంగా 39 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఆదిలాబాద్, జగిత్యాల, ఖమ్మంలో 38.9 డిగ్రీలు, మంచిర్యాలలో 38.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశముందని, వృద్ధులు, పిల్లలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.