GDWL: గద్వాల – అయిజ రహదారిపై కురువపల్లి, పరుమాల గ్రామాల మధ్య మంగళవారం ఓ కారు బోల్తా పడింది. గద్వాల నుంచి అయిజ వైపు వెళ్తున్న కారు.. ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించే క్రమంలో అదుపుతప్పి పక్కకు ఒరిగింది. కారులో ఉన్న ఓ వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.