BDK: భద్రాద్రి సీతారామచంద్రస్వామి ఆలయంలో గురువారం నిత్య కళ్యాణ వేడుక వైభవంగా నిర్వహించారు. తెల్లవారుజామున గర్భాలయంలో స్వామివారికి సుప్రభాత సేవ, ఆరాధనలు నిర్వహించిన అనంతరం, ఉత్సవ మూర్తులను మేళతాళాలతో బేడా మండపానికి తీసుకొచ్చారు. అర్చకులు శాస్త్రోక్తంగా విశ్వక్సేన పూజ, పుణ్యహవాచనం, కంకణధారణగావించి సీతారాముల కల్యాణాన్ని జరిపించారు.
Tags :