అసలు పుష్ప2 షూటింగ్ మొదలైందా.. లేదా.. అనేదే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఎందుకంటే ఇప్పటి వరకు ఇటు సుసుకుమార్ నుంచి గానీ, మైత్రీ మూవీ మేకర్స్ నుంచి గానీ ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇటీవలె బన్నీపై లుక్ టెస్ట్ ఫోటో షూట్ చేసిన చిత్ర యూనిట్.. రామోజీ ఫిలిం సిటీలో ప్రత్యేకంగా వేసిన సెట్లో షూటింగ్ మొదలు పెట్టినట్టు ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. అది కూడా బన్నీ లేకుండానే ఈ మూవీ షూటింగ్‌ని మొదలు పెట్టారని వార్తలు వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం బన్నీ తన ఫ్రెండ్ పెళ్లి కోసం ఫ్యామిలీతో కలిసి దక్షిణాఫ్రికాలో ఉన్నాడు. ఐకాన్ స్టార్ తిరిగి రాగనే పుష్ప2 సెట్స్‌లో జాయిన్ అవుతాడని వినిపించింది. లేదంటే బ్యాంకాక్ షెడ్యూల్లో బన్నీ హాజరవుతాడని కూడా టాక్ నడిచింది. కానీ ఇప్పటి వరకు ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయిందనే విషయంలో అఫిషీయల్ అనౌన్స్మెంట్ మాత్రం లేదు. దీంతో ‘పుష్ప 2’ రెగ్యులర్ షూట్ మొదలైందా.. లేదా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే.. మళ్లీ కొత్తగా బన్నీ సౌత్ అఫ్రికా నుంచి తిరిగొచ్చాక పుష్ప2 షూటింగ్‌ని స్టార్ట్ చేయనున్నారనే న్యూస్ వినిపిస్తోంది.
డిసెంబర్ నుంచి రెగ్యులర్ షూట్‌ను ప్రారంభించాలని అనుకుంటున్నారట సుకుమార్. దాంతో ఇంకా సుకుమార్ షూటింగ్ స్టార్ట్ చేయలేదా అని డిసప్పాయింట్ అవుతున్నారు బన్నీ అభిమానులు. లేదంటే షూటింగ్ అప్టేట్ ఇవ్వాలని కోరుతున్నారు.
మరి ఇప్పటికైనా పుష్పరాజ్ టీమ్ దీనిపై క్లారిటీ ఇస్తుందేమో చూడాలి. ఇకపోతే.. మన లెక్కల మాస్టారు పెరిగిన అంచనాలకు తగ్గట్టుగా పుష్ప2ని భారీ బడ్జెట్‌తో తెరకెక్కించబోతున్నాడు. స్క్రిప్ట్ దగ్గరి నుంచి లొకేషన్స్ వరకు ప్రతీ విషయంలోనూ జాగ్రత్తా ప్లాన్ చేస్తున్నాడు.