VSP: అభివృద్ధి పేరుతో భూసేకరణలు పెంచి కార్పొరేట్ సంస్థలకు భూములు కేటాయిస్తున్నారని ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక అధ్యక్షులు కెఎస్ చలం అన్నారు. గురువారం ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక ఆధ్వర్యంలో రౌండ్‌టేబుల్ సమావేశంలో అయన మాట్లాడారు. గిరిజన చట్టాలను కూడా పట్టించుకోకుండా ప్రాజెక్టుల పేరుతో భూములు తీసుకుంటున్నారని అన్నారు.