SRPT: స్వాతంత్ర సమరయోధుడు, తెలంగాణ తొలి తరం ఉద్యమ నాయకుడు కొండ లక్ష్మణ్ బాపూజీ 13వ వర్ధంతి సందర్భంగా ఆదివారం తుంగతుర్తి మండల పరిధిలోని బండరామారం గ్రామంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు తాటికొండ సీతయ్య మాట్లాడుతూ.. రజాకార్లకు వ్యతిరేకంగ జరిగిన పోరాటంలో ఆయన కీలక పాత్ర పోషించారని అన్నారు.