KMM: బోనకల్లు మండలంలోని లక్ష్మీపురంలో ఎర్రమట్టి గుట్టల నుంచి ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా మట్టి తరలిస్తున్న మూడు టిప్పర్లను ఎస్సై పొదిలి వెంకన్న శనివారం పట్టుకున్నారు. ఈ అక్రమ రవాణాపై మైనింగ్ శాఖకు సమాచారం అందించగా, రెండు టిప్పర్లపై ఈ -చలాన్లు విధించినట్లు ఎస్సై తెలిపారు. మట్టి అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.