TPT: ఇంటి పన్నులలో పేర్లు సరిదిద్దుటకు అవకాశం కల్పించినట్లు కమిషనర్ ఫజులుల్లా తెలిపారు. గతంలో అనుకోకుండా ఇంటి, ఖాళీ స్థలం పన్నుల ఇంటి యజమాని పేరు, ఇంటి పేరులో స్పెల్లింగ్ మిస్టేక్, తలుపు నెంబరు తప్పుగా రావడం జరిగిందని తెలిపారు. ఈ మేరకు నాయుడుపేట పట్టణ ప్రజలు తప్పులకు సంభందించి సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.