ASR: రంపచోడవరం మండలం తామరపల్లి పంచాయతీలో గురువారం సర్పంచ్ మిర్తివాడ ఆనంద్ రెడ్డి అధ్యక్షతన సామాజిక తనిఖీ గ్రామసభ నిర్వహించారు. ముసరుమిల్లి ఎంపీటీసీ వంశి కుంజం హాజరై 2024-25లో చేపట్టిన పనులను గ్రామస్థులకు వివరించారు. రైతులకు అందించే జీడి, మామిడి మొక్కల కోసం ఫీల్డ్ అసిస్టెంట్లు, అగ్రికల్చర్, హార్టికల్చర్ శాఖలు కలిసి రైతుల వివరాలు సేకరించాలని సూచించారు.