కృష్ణా: టెన్త్ ఉత్తీర్ణత శాతం గణనీయంగా పెరగాలని నియోజకవర్గ ప్రత్యేక అధికారి పెనుమూడి సాయిబాబు స్పష్టం చేశారు. గురువారం చల్లపల్లి మండలం మంగళాపురంలో జడ్పీ హైస్కూలును ఆయన సందర్శించారు. మధ్యాహ్న భోజన రికార్డులు పరిశీలించారు. పదవ తరగతి పరీక్షల్లో ప్రతి విద్యార్థి పాస్ అయ్యేలా శ్రద్ధ వహించాలని సూచించారు. ఇందులో భాగంగా పలువురు అధికారులు పాల్గొన్నారు.